: వ్యూహం మార్చిన జగన్.. కార్యకర్తలకు మరింత దగ్గరవుతున్న వైసీపీ చీఫ్


వైసీపీ అధినేత జగన్ వ్యూహం మార్చారు. కార్యకర్తలకు మరింత దగ్గరవాలని నిర్ణయించుకున్నారు. కిందిస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్న జగన్ ఇక నుంచి వారిని నేరుగా కలవనున్నారు. ఈ మేరకు వారికి సంకేతాలు పంపారు. ఇక నుంచి తాను కార్యకర్తలకు దూరంగా ఉండనని, పార్టీ అభివృద్ధికి తోడ్పడే సలహాలు సూచనలను తనతో నేరుగా పంచుకోవచ్చని సూచించినట్టు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు వరకు కార్యకర్తలతో జగన్ అంటీముట్టనట్టుగా ఉండేవారిని, అధినేతను కలవాలంటే కార్యకర్తలు కూడా భయపడేవారని ఓ నేత పేర్కొన్నారు. ప్రజలను నేరుగా వారింటికి వెళ్లి కలిసేందుకు ఇష్టపడే జగన్ కార్యకర్తలను మాత్రం పట్టించుకునే వారు కాదనే అపవాదు ఆయనపై ఉండేదని ఆయన తెలిపారు. కేడర్‌‌తో సమావేశాలు నిర్వహించే అలవాటు కూడా ఆయనకు ఉండేది కాదని పేర్కొన్నారు. జగన్ తీరుపై కేడర్ అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ తన దృష్టికి రావడంతో జగన్ తన మైండ్‌సెట్‌ను మార్చుకున్నారని ఆయన వివరించారు. ఇక నుంచి కార్యకర్తలతో నేరుగా మాట్లాడతారని, వారి సాధకబాధకాలు వింటారని తెలిపారు. అక్టోబరు నుంచి కొత్త జగన్‌ను చూస్తారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News