: హిమాచల్ ప్రదేశ్ లో స్వల్ప భూకంపం


ఈ ఉదయం 6:45 గంటల సమయంలో ఉత్తరాన స్వల్ప భూకంపం సంభవించింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైనట్టు భారత జియోలాజికల్ సర్వే విభాగం అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల ఇండ్ల గోడలకు బీటలు వారినట్టు తెలుస్తోంది. అంతకుమించి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టేమీ వార్తలు వెలువడలేదు. ఈ భూకంపంపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News