: రెండు రోజులుగా తిరుమలలోనే... రెండోసారి వెంకన్న సన్నిధికి పవన్ కల్యాణ్
రెండు రోజులుగా తిరుమలలోని అతిథి గృహంలో మకాం వేసిన సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేటి ఉదయం మరోసారి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాడు. ఈ ఉదయం సుప్రభాత సేవ సమయంలో పవన్ కల్యాణ్ ఆలయంలోకి వచ్చారు. నేటి మధ్యాహ్నం 3 గంటల వరకూ పవన్ తిరుమలలోనే ఉంటారని, భోజనం అనంతరం తిరుపతికి వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు తిరుపతి ఇందిరా మైదానంలో పవన్ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మైదానం చిన్నదిగా ఉండటంతో ఇబ్బందులు తప్పేలా లేవని జనసేన నాయకులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.