: ఎల్బీన‌గ‌ర్ శ్రీ‌చైత‌న్య ఐఐటీ అకాడ‌మీలో విషాదం.. విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌


హైద‌రాబాద్ శివారులోని ఎల్బీన‌గ‌ర్ శ్రీ‌చైత‌న్య ఐఐటీ అకాడ‌మీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. వాష్ రూంలో ఉరేసుకొని ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం విద్యార్థిని అన్వితారెడ్డి ఆత్మహత్య చేసుకుంది. అన్వితారెడ్డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన‌ విద్యార్థిని. ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌న్న వార్త తెలుసుకున్న విద్యార్థినులు షాక్‌కు గుర‌య్యారు. అకాడ‌మీలో విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల గురించి తెలియాల్సి ఉంది. విద్యార్థిని త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారాన్ని తెలిపారు. పోలీసులు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ లోప‌లికి ఎవ‌రినీ రానివ్వ‌కుండా సిబ్బంది గేటుకి తాళాలు వేశారు. విద్యార్థిని మృత‌దేహాన్ని కామినేని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

  • Loading...

More Telugu News