: ‘మహా’ ఒప్పందంపై చంద్రబాబు నోరు విప్పాలి!... ఏపీసీసీ చీఫ్ రఘువీరా డిమాండ్!


తెలంగాణలో మూడు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కేసీఆర్ సర్కారు మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పందించారు. ఆ రెండు రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పందించాలని ఆయన కొద్దిసేపటి క్రితం డిమాండ్ చేశారు. ‘మహా’ ఒప్పందంగా పిలుస్తున్న సదరు ఒప్పందం వల్ల ... ఏపీకి లాభమా? లేదా నష్టమా? అన్న విషయాన్ని చంద్రబాబు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అయినా కేంద్రం అనుమతి లేకుండా మహారాష్ట్రతో తెలంగాణ సర్కారు ఎలా ఒప్పందం చేసుకుంటుందని రఘువీరా ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు భయం కారణంగానే ఈ ఒప్పందంపై చంద్రబాబు నోరు విప్పడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News