: నయీమ్ ను పెంచి పోషించింది టీడీపీ, కాంగ్రెస్ లే!... సీబీఐ దర్యాప్తు కోరే అర్హతే వాటికి లేదంటున్న నాయిని!


గ్యాంగ్ స్టర్ నయీమ్ ను పెంచి పోషించింది తాము కాదని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా నేటి మధ్యాహ్నం ఆయన అక్కడి మీడియాతో మాట్లాడుతూ నయీమ్ ను పెంచి పోషించింది టీడీపీ, కాంగ్రెస్ లేనని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే నయీమ్ దందాపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసే అర్హత ఆ పార్టీలకు లేదని ఆయన తేల్చిచెప్పారు. నయీమ్ బాధితులందరికీ సీఎం కేసీఆర్ న్యాయం చేసి తీరతారని కూడా నాయిని చెప్పారు.

  • Loading...

More Telugu News