: లోకేష్ ఓకే... ఇంకా మెరుగుపడాలి: చంద్రబాబు
లోకేష్ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, లోకేష్ కు టెక్నాలజీని వినియోగించుకోవడం బాగా తెలుసని అన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆయన పనితీరు భేష్ అని కితాబునిచ్చారు. అయితే చాలా విషయాల్లో ఆయన పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం లోకేష్ పనిచేస్తున్న విధానం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ఆయన చాలా అంశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో లోకేష్ మమేకమయ్యే తీరు అద్భుతమని ఆయన చెప్పారు. త్వరలోనే లోకేష్ తన అంచనాలకు తగ్గ పనితీరును ప్రదర్శిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.