: అప్పు తిరిగి చెల్లించమన్నందుకు కర్రలతో క్రూరంగా దాడి
రాజస్థాన్‌లో బీల్వాడా జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. అప్పు ఇచ్చిన పాపానికి ఓ వ్యక్తి చావుదెబ్బలు తిన్నాడు. తన వద్ద తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు అతడిపై కోపం తెచ్చుకున్న రుణగ్రహీత తన స్నేహితుల సాయంతో తనకు అప్పు ఇచ్చిన వ్యక్తిపై దాడికి దిగాడు. ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. అప్పు ఇచ్చిన వ్యక్తి తనను కొట్టవద్దని ఎంతగా బతిమిలాడినా వదలలేదు. కర్రలతో క్రూరంగా అతడిపై దాడి చేశారు. తనను వదిలేయాలని ఏడుస్తూ వేడుకున్నా అతడిని చితక్కొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.