: సి.కల్యాణ్ కు ముగ్గురు హీరోయిన్లతో సంబంధాలు!... బ్లూఫిలింల కేసులో జైలుకెళ్లాడు!: నట్టి కుమార్


గ్యాంగ్ స్టర్ నయీమ్ తో టాలీవుడ్ కు లింకులున్నాయంటూ నిర్మాత నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నట్టి కుమార్ పై పలువురు నిర్మాతలు విరుచుకుపడగా, సదరు నిర్మాతల వ్యాఖ్యలపై నట్టి కుమార్ కూడా వేగంగానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం మీడియా ముందుకు వచ్చిన ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్... నట్టి కుమార్ పై విరుచుకుపడ్డారు. నోరు జారితే చెప్పు తెగుద్ది అంటూ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కల్యాణ్ మీడియా సమావేశంపై కొద్దిసేపటి క్రితం నట్టి కుమార్ కూడా స్పందించారు. ఆఫీస్ బాయ్ గా పనిచేసిన కల్యాణ్ అనతి కాలంలోనే కోట్లు ఎలా సంపాదించాడని నట్టి కుమార్ ప్రశ్నించారు. అంతేకాకుండా బ్లూ ఫిలింల కేసులో జైలుకెళ్లి వచ్చిన చరిత్ర కల్యాణ్ దేనంటూ ఆయన ఆరోపించారు. నయీమ్ తో కల్యాణ్ కు సంబంధాలున్నాయని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. దొంగతనాలతోనే కల్యాణ్ ఎదిగాడని ఆరోపించారు. ముగ్గురు హీరోయిన్లతో కల్యాణ్ కు సంబంధాలున్నాయని కూడా నట్టిె కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై భౌతిక దాడులు చేస్తానని కల్యాణ్ బెదిరిస్తున్నాడని చెప్పారు. అయితే తాను మాత్రం చావుకైనా సిద్ధమేనని కూడా ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News