: స్విస్ చాలెంజ్ పై ఎందుకింత రహస్యం?: ఏపీ సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు


నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి కాంట్రాక్టులను అప్పగించేందుకు చంద్రబాబు సర్కారు తీసుకువచ్చిన స్విస్ చాలెంజ్ విధానంపై తెలుగు రాష్ట్రాల హైకోర్టులో వాడివేడి విచారణ జరుగగా, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రహస్యంగా వివరాలు దాస్తోందంటూ మొట్టికాయలు వేసింది. స్విస్ చాలెంజ్ విధానం గురించి ముందుగా చెప్పి ప్రకటనలు ఇచ్చుంటే, మరిన్ని కంపెనీలు వేలంలో పాల్గొనేవని అభిప్రాయపడింది. ఆపై ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఈ విధానానికి సంబంధించి అన్ని వివరాలనూ కోర్టుకు తెలియజేస్తామని చెప్పారు. అందుకు కొంత సమయం కావాలని కోరగా, మధ్యాహ్న భోజన విరామం తరువాత 2:30 గంటలకు కేసు విచారణ కొనసాగిస్తామని చెబుతూ వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News