: టర్కీలో రెచ్చిపోయిన ఉగ్ర‌వాదులు.. తొమ్మిది మంది పోలీసుల మృతి.. 64 మందికి గాయాలు


టర్కీలోని సిర్నక్ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. భారీ పేలుడు జ‌రిపి బీభత్సం సృష్టించారు. సిజర్‌ నగర పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో భారీ పేలుడుకు పాల్ప‌డ్డారు. అధికారికంగా ఏ ఉగ్ర‌వాద‌ సంస్థా ఇప్ప‌టివ‌ర‌కు తామే పేలుడుకి కార‌ణ‌మ‌ని ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ కుర్దిష్ ఉగ్ర‌వాదులే ఈ దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి తొమ్మిది మంది పోలీసులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 64 మంది గాయాల‌పాల‌య్యారు. పోలీసు కార్యాల‌య బిల్డింగ్ పూర్తిగా ధ్వంస‌మైంది. గాయాల‌పాల‌యిన పోలీసులు ప్ర‌స్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News