: అభినవ కర్ణుడే... ఆదాయంలో 75 శాతం దానమిస్తానన్న ఎల్అండ్ టీ చీఫ్


తాను జీవితాంతం సంపాదించే ఆదాయంలో 75 శాతం దాన ధర్మాలకే వెచ్చించనున్నట్టు లార్సెన్ అండ్ టూబ్రో చీఫ్ ఏఎం నాయక్ ప్రకటించారు. తన వద్ద సుమారు 1600 కోట్ల డాలర్ల సంపద ఉందని తెలిపిన ఆయన, ఎల్అండ్ టీ నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. తన తాత, తండ్రి డబ్బులేక ఎంతో పేదలుగా కాలం గడిపారని గుర్తు చేసుకున్న ఆయన, తన మనవరాలు చనిపోవడం తననెంతో కలచి వేసిందని అన్నారు. కాగా, 1965లో ఎల్అండ్ టీలో జూనియర్ ఇంజనీరుగా ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు చైర్మన్ స్థాయికి ఎదిగిన నాయక్ 2017లో రిటైర్ కానున్న సంగతి తెలిసిందే. మనవరాలికి నివాళిగా నిరాళి మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ ను ఇప్పటికే స్థాపించిన ఆయన, ప్రస్తుతం 7 ప్రాజెక్టులను ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు. వాటిల్లో రెండు వచ్చే సంవత్సరం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News