: తప్పుడు కేసు పెట్టిన రియో 'గోల్డ్' అమెరికన్ స్విమ్మర్... బ్రెజిల్ జైలు తప్పదా?


అమెరికన్ స్టార్ స్విమ్మర్, రియో ఒలింపిక్స్ లో స్వర్ణ పతక విజేత ర్యాన్ లోక్టే ఇప్పుడు ఓ పెద్ద కేసులో చిక్కుకున్నాడు. తనపై ఎలాంటి దాడి, దొంగతనం జరగకపోయినా, తన విలువైన వస్తువులు పోయాయంటూ తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన కేసు ఆయనపై బిగుసుకుంటోంది. ఈ కేసులో ర్యాన్ కావాలనే తప్పుడు కేసు పెట్టాడని తేలితే అతనికి బ్రెజిల్ లో జైలు శిక్ష ఖాయమని నిపుణులు అంటున్నారు. ఒలింపిక్స్ జరుగుతున్న వేళ, ఓ రోజు రాత్రి మరో ఇద్దరు ఆటగాళ్లతో కలసి పార్టీకి వెళుతుంటే, కొందరు దుండగులు అటకాయించి నగదు తీసుకువెళ్లినట్టు ర్యాన్ ఫిర్యాదు ఇవ్వగా విచారించిన రియో పోలీస్ చీఫ్ ఫెర్నాండో వెలాసో కేసు తప్పుడుదని తేల్చి నివేదికను కోర్టుకు ఇచ్చారు. ఈ కేసులో అతనికి సమన్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయించగా, దోషిగా తేలితే ఆరు నెలల వరకూ శిక్ష తప్పక పోవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News