: గద్వాలను జిల్లాగా ప్రకటించాలంటూ ఐకాస ఆందోళ‌న‌.. 20 మంది అరెస్టు


మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోని గద్వాలను జిల్లాగా ప్రకటించాలంటూ జిల్లా సాధన ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) ఆధ‌్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళ‌నకు దిగారు. త‌మ డిమాండ్‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సానుకూల ప్ర‌క‌ట‌న చేయాల‌ని ఈరోజు నుంచి మూడు రోజుల పాటు నిరవధిక బంద్‌కు జేఏసీ, అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌మ కార్యాచరణలో భాగంగా జేఏసీ నాయ‌కులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు. గ‌ద్వాల‌లో 114 సెక్ష‌న్ ఉన్నందున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌లు చేపట్టే వీలులేద‌ని పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల‌కి, జేఏసీ నాయ‌కుల‌కి మ‌ధ్య వాగ్వివాదం చెల‌రేగింది. దీంతో 20 మంది జేఏసీ నాయ‌కుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News