: బ్లూ ఫిల్మ్ లు, హీరోయిన్ల నగ్న చిత్రాలు తీసే నువ్వా, నన్ననేది?: ప్రొడ్యూసర్ కల్యాణ్
నీలి చిత్రాలు తీస్తూ, లీజుకు తీసుకున్న థియేటర్లను తనవని చెప్పుకుని బ్యాంకుల ఓడీ లావాదేవీలు నడిపించిన నట్టి కుమార్ కు తనను విమర్శించే స్థాయి లేదని నిర్మాత సి.కల్యాణ్ వ్యాఖ్యానించారు. తన సినిమాల్లో నటించే హీరోయిన్ల నగ్న చిత్రాలను తీసి వారినే బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర నట్టి కుమార్ వెనకుందని, వైజాగ్ నుంచి తరిమేస్తే హైదరాబాద్ వచ్చి తలదాచుకున్నాడని ఆరోపించారు. తన కొడుకు ప్రాజెక్టు రిపోర్టుకని అడిగితే తన సినిమా 'ఎటో వెళ్లిపోయింది మనసు' కాపీ ఇస్తే, దాన్ని నెట్లో పెట్టి, ఆపై కేసులకు భయపడి తన కాళ్లు పట్టుకున్నాడని కల్యాణ్ అన్నారు. త్వరలోనే విశాఖపట్నం బ్యాంకుల్లో నట్టి జరిపిన కుంభకోణం బయటకు రానుందని చెప్పుకొచ్చారు. కాగ, ఈ నిర్మాతలిద్దరి మధ్యా జరుగుతున్న మాటలయుద్ధం తీవ్రతరమైంది. ఒకరిపై ఒకరు పెను ఆరోపణలనే సంధించుకుంటున్నారు. నిన్న నట్టి మీడియా ముందుకు వచ్చి గ్యాంగ్ స్టర్ నయీమ్ కు, కల్యాణ్ కు సంబంధముందని ఆరోపించిన సంగతి తెలిసిందే.