: నోరు జారితే చెప్పు తెగుద్ది!... నట్టి కుమార్ కు సి.కల్యాణ్ ఘాటు వార్నింగ్!


నయీమ్ తో టాలీవుడ్ లింకులకు సంబంధించి నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలు... పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. నయీమ్ తో సంబంధాలున్నాయంటూ నట్టి కుమార్ ప్రస్తావించిన పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే వివరణ ఇచ్చారు. తాజాగా నేటి ఉదయం హైదరాబాదు, ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ కూడా తెర ముందుకు వచ్చారు. తనపై నట్టి కుమార్ చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సి ఉన్నందునే తాను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నట్టి కుమార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కల్యాణ్... ‘నోరు జారితే చెప్పు తెగుద్ది’ అంటూ వార్నింగులు కూడా ఇచ్చారు. క్రీస్తు పేరు చెప్పుకుని నట్టి కుమార్ డబ్బులు దండుకుంటున్నాడని ఆరోపించారు. నట్టి కుమార్ చరిత్ర మొత్తం బ్లాక్ మెయిలింగేనని కల్యాణ్ చెప్పారు. నయీమ్ బాధితులకు మల్లే నట్టి కుమార్ బాధితుల కోసం కూడా ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కూడా కల్యాణ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News