: సెల్ఫీ దిగుతూ పోలవరం కాలువలో పడి కొట్టుకుపోయిన ఏలూరు విద్యార్థిని అర్చన
సెల్ఫీ మోజు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. కృష్ణాష్టమి సందర్భంగా కాలేజీకి సెలవు ఇవ్వడంతో స్నేహితులతో కలసి సరదాగా గడిపేందుకు వచ్చిన ఏలూరు ఇంటర్ విద్యార్థిని చిందాడి అర్చన (17) ప్రమాదవశాత్తూ పోలవరం కుడి కాలువలో పడి కొట్టుకుపోయింది. తన స్నేహితులతో కలసి పెదవేగి మండలం లక్ష్మీపురం గార్డెన్స్ లోని శ్రీసాయి స్థూపం చూసేందుకు వచ్చిన అర్చన తిరుగు ప్రయాణంలో పోలవరం కాలువ దగ్గర ఆగింది. ఆ సమయంలో సెల్ఫీ తీసుకునేందుకు కాలువ గట్టుపై నిలబడి ప్రయత్నించిన అర్చన కాలు జారి నీటిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.