: కొత్త యాంగిల్, నయీమ్ అలియాస్ జేమ్స్... చత్తీస్ గఢ్ లో మరో రూపం!


తెలుగు రాష్ట్రాల్లో ఆడవేషాలు వేస్తూ, బురఖాలు ధరించి తిరిగిన నయీమ్, చత్తీస్ గఢ్ ప్రాంతంలో జేమ్స్ అనే పేరుతో సంచరిస్తూ, దందాలు నడిపాడని ప్రత్యేక విచారణ బృందం (సిట్) గుర్తించింది. ఇక్కడ పోలీస్ ఇన్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న తరువాత, చత్తీస్ గఢ్ లో మావోలను అణచివేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులకు తనవంతు సహాయ సహకారాలను అందించిన నయీమ్, తనను గుర్తించకుండా ఉండేందుకు జేమ్స్ పేరిట తిరిగినట్టు తెలుస్తోంది. మావోయిస్టులకు చిక్కకుండా ఉండేందుకు కూడా మారుపేరు సహకరించిందని సిట్ అధికారి ఒకరు తెలిపారు. నయీమ్ ముఖ్య అనుచరుల్లో ఒకడైన పాశం శ్రీనుకు దగ్గరగా ఉండే 20 మందికి సంబంధించిన వివరాలను సేకరించిన అధికారులు భువనగిరి సమీపంలోని రాయగిరి, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లో పలువురిని విచారించారు. కొందరిని అరెస్ట్ చేశారు. వీరిని భువనగిరి డీఎస్పీ కార్యాలయంలోనే విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News