: నేను సీ గ్రేడ్ సినిమాల్లో కూడా పని చేశాను: ముమైత్ ఖాన్


తాను సీ గ్రేడ్ సినిమాల్లో కూడా పని చేశానని ముమైత్ ఖాన్ తెలిపింది. పూరీ జగన్నాథ్ తో తన స్నేహం స్వచ్ఛమైనదని చెప్పింది. తమపై ఆరోపణలు చేసినవారి ఆలోచనలే చెడిపోయాయని, తాము కాదని, అందుకే తమ స్నేహం 11 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆమె తెలిపింది. తాను చాలా మందితో కలసి పని చేశానని, వారితో లేని ఆరోపణలు, పూరీతోనే ఎందుకంటే ఆయనకు మంచి పేరు ప్రతిష్ఠలున్నాయని, వాటిపై బురద జల్లడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తారని ఆమె తెలిపింది. తాను రాజమౌళి, పూరీ జగన్నాథ్, ప్రభాస్, మహేష్ బాబు... ఇలా చాలా మంది మంచి మనుషులతో పని చేశానని చెప్పింది. తాను పనిలో తేడాలు వెతుక్కోలేదని, సినిమా చిన్నదా? పెద్దదా? అని చూడకుండా పని చేశానని, అందుకే సీ గ్రేడ్ సినిమాలలో కూడా పని చేశానని చెప్పింది. సినిమాకు పని చేసేవారు పడే కష్టం అందరిదీ ఒకటేనని, అయితే పనులు వేరు, వేతనాలు వేరని ఆమె తెలిపింది. అందరికీ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనుషులుగా మనపై ఉందని ఆమె చెప్పింది.

  • Loading...

More Telugu News