: సినీ పరిశ్రమకు చెడ్డ పేరు రాకూడదనే సమాధానమిస్తున్నాం: సినీ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు
సినీ పరిశ్రమపై నట్టి కుమార్ ఆరోపణలు చేయడం సరికాదని ప్రముఖ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నయీం మరణించాడు కనుక అతనిపై నట్టి కుమార్ ఆరోపణలు చేస్తున్నాడని, రేపు దావూద్ ఇబ్రహీం మరణించినా అతనితో సినీ పరిశ్రమకు లింకులున్నాయని ఆరోపిస్తాడని అన్నారు. ఆరోపణలు చేయడానికి నోరుంటే సరిపోతుందని, సాక్ష్యాలు కావాలని ఆయన చెప్పారు. నట్టి కుమార్ వెనుక కొంత మంది ఉన్నట్టు కనిపిస్తోందని, వారి ప్రోద్బలంతోనే ఆయన చిలకపలుకుల్లా కొన్ని మాటలు మాట్లాడారని ఆయన తెలిపారు. ఆయన ఆధారాలు సిట్ కు ఇస్తానంటున్నప్పుడు ఇస్తే తేలిపోతుందని ఆయన చెప్పారు. గతంలో భాను విషయంలో కూడా నట్టి కుమార్ ఆరోపణలు చేశాడని, అవి నిజం కాదని తేలిపోయిందని ఆయన గుర్తుచేశారు.