: పాతబస్తీలో నయీమ్ అనుచరులు లేరు: సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ
తెలంగాణ పోలీసుల ఎన్కౌంటర్లో ఇటీవలే గ్యాంగ్‌స్టర్ నయీమ్ హతమైన సంగతి తెలిసిందే. నయీమ్ అనుచరులను అరెస్టు చేస్తూ పోలీసులు ఈ కేసులో వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. పలు జిల్లాల్లో నయీమ్, అతని అనుచరులపై కేసులు నమోదవుతున్నాయి. అయితే హైదరాబాద్‌లోని పాతబస్తీవాసి యూసుఫ్.. నయీమ్ అనుచరుడు అంటూ వస్తోన్న వార్తలను సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఖండించారు. పాతబస్తీలో నయీమ్ అనుచరులు లేరని అన్నారు. యూసుఫ్‌ను ఏడాది క్రితమే పీడీయాక్ట్ కింద జైలుకి తరలించామని ఆయన చెప్పారు. నయీమ్ కేసులో వస్తోన్న వదంతులు నమ్మొద్దని సూచించారు.