: కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై రూ.80 వేల కోట్ల భారం మోపారు: మల్లు భట్టీవిక్రమార్క
మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకులు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టీవిక్రమార్క కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై రూ.80వేల కోట్ల భారం మోపారని, ఆయన కుటుంబ ప్రయోజనాల కోసమే ఇటువంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రాజెక్టుల ఎత్తు తగ్గించుకొని తెలంగాణకు వచ్చారని భట్టీవిక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించిందని వేడుకలు చేసుకున్నారు? అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ నేతలు గతంలో జలయజ్ఞంలో దోచుకున్నారని కేసీఆర్ ఆరోపిస్తున్నారని, ఆధారాలు లేకుండా అటువంటి వ్యాఖ్యలు చేసిన ఆయనను జైల్లో పెట్టాలని వ్యాఖ్యానించారు.