: చిన్ని కృష్ణుడి వేషధారణలో బుడిబుడి న‌డ‌క‌ల‌తో చిన్నారుల సందడే సంద‌డి!


దేశ వ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్ట‌మి వేడుక‌లు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా శ్రీ‌కృష్ణుడి నామస్మరణలే వినిపిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా చిన్ని కృష్ణుడి వేషధారణలో చిన్నారులు సందడి చేస్తూ క‌నిపిస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ప్ర‌త్యేకంగా హైద‌రాబాద్‌, ముంబ‌యి, మ‌ధుర‌, బెంగుళూరు, ఢిల్లీ, పూణె, నాగ్‌పూర్‌ న‌గ‌రాల్లో ఉట్ల సంబ‌రాల‌కు భారీ ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఘ‌నంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నారు. ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన‌డానికి యువ‌కులు ఎంతో ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఢిల్లీలో ఇస్కాన్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా కృష్ణాష్ట‌మి జ‌రుపుకుంటున్నారు. దేశ‌వ్యాప్తంగా కృష్ణుడి ఆల‌యాల‌కు భ‌క్తులు పోటెత్తారు. కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ఉట్ల సంబ‌రాల‌కు ముంబ‌యిలో భారీ ఏర్పాట్లు చేశారు. ఆయా న‌గ‌రాల్లోని వీధుల్లో భజన సంకీర్తన చేసుకుంటూ భ‌క్తులు ప్రదర్శనలు నిర్వ‌హిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో ఉత్సాహ‌భ‌రిత వాతావ‌ర‌ణం క‌న‌ప‌డుతోంది. అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆల‌యంలో కృష్ణాష్ట‌మి సంద‌డి క‌నిపిస్తోంది. అనేక ఆల‌యాలు, పాఠ‌శాల‌ల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపిక‌ల‌ వేషధారణతో ఆకట్టుకుంటున్నారు. చిన్ని కృష్ణుడి వేషధారణలో బుడిబుడి న‌డ‌క‌ల‌తో చిన్నారులు సంద‌డి చేస్తున్నారు.

  • Loading...

More Telugu News