: నాకు ఏ హీరోతోనూ గొడవల్లేవు: పవన్ కల్యాణ్
తెలుగు చిత్ర పరిశ్రమలోని సాటి హీరోలతో తనకెన్నడూ గొడవలు లేవని, అసలు పరిశ్రమలో ఏ హీరో కూడా మరో హీరోతో గొడవలు పెట్టుకోరని, కింది స్థాయిలో అభిమానుల మధ్యే విభేదాలుంటాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం హత్యకు గురైన తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కోలార్ పోలీసులను సంప్రదించి అసలు ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకుంటానని తెలిపారు. హీరోల మధ్య పోటీతత్వం మాత్రమే ఉంటుందని, అది సినిమాలకు మాత్రమే పరిమితమని, మిగతా విషయాల్లో కలిసే ఉంటామని స్పష్టం చేశారు. మితిమీరిన అభిమానం హింసకు, హత్యలకు దారితీస్తే, అది సహించరాని నేరమవుతుందని పవన్ అన్నారు.