: ఎంత దారుణం... పెచ్చు మీరిన అభిమానం ఓ కుటుంబాన్ని వీధిన పడేసింది: పవన్ కల్యాణ్


సినిమా హీరోలపై పెచ్చు మీరిన అభిమానం ఓ కుటుంబాన్ని వీధిన పడేసిందని, ఇది చాలా దారుణమైన ఘటనని హీరో పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. హత్యకు గురైన తన అభిమాని వినోద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పవన్ ను చూసిన వినోద్ తల్లిదండ్రులు, సోదరి కన్నీరు మున్నీరయ్యారు. చేతికందొచ్చిన బిడ్డ ఇలా దూరమవుతాడని అనుకోలేదని వాపోయారు. వారిని ఓదార్చిన అనంతరం, అభిమానం హద్దులు దాటి పైశాచికంగా మారడాన్ని ఎవరూ హర్షించరని, వినోద్ మరణానికి కారణమైన వారిని చట్టం ముందు దోషిగా నిలపాల్సిందేనని పవన్ కల్యాణ్ అన్నారు. ఇది దారుణమైన ఘటనని ఆయన చెప్పారు. హద్దులు దాటి ఒకరిని ఒకరు హత్యలు చేసుకునేంత అభిమానాన్ని ఎవరూ హర్షించరని హితవు పలికారు. ఏ హీరో అభిమానులైనా హద్దుల్లో ఉంటేనే మంచిదని వివరించారు. ఈ ఘటనతో వినోద్ తల్లికి తీరని శోకం మిగిలిందని, భవిష్యత్తులో ఎవరి అభిమానులైనా ఈ తరహా చర్యలకు దిగకుండా ఉండాలని పవన్ సూచించారు.

  • Loading...

More Telugu News