: కర్ణాటక ప్రభుత్వం విఫలమైతే సీబీఐ దర్యాఫ్తుకు డిమాండ్: పవన్ కల్యాణ్
తన అభిమాని వినోద్ హత్య కర్ణాటకలోని కోలార్ లో జరిగినందున విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత కన్నడ ప్రభుత్వానిదేనని, వారు విఫలమయ్యారని భావిస్తే, సీబీఐ ఎంక్వయిరీకి డిమాండ్ చేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. క్షణికావేశంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుకొంటున్నానని అభిప్రాయపడ్డారు. ఈ ఉదయం తిరుపతిలో పర్యటించిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, కోలార్ పోలీసులు త్వరితగతిన దర్యాఫ్తు చేయాలని, క్రిమినల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని సూచించారు. మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాల్సిన యువకుడు, ఇలా ప్రాణాలు కోల్పోవడం కలచి వేసిందని అన్నారు.