: ఇట‌లీ భూకంపంలో 247 కు చేరిన మృతుల సంఖ్య.. మరింత పెరిగే అవకాశం


ఇట‌లీలో సంభ‌వించిన భూకంపంలో మృతుల సంఖ్య 247 కు చేరింది. శిథిలాల తొల‌గింపు ప్ర‌క్రియ ఇంకా కొన‌సాగుతోంది. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నిన్న భూకంప లేఖినిపై 6.2 తీవ్రతతో ఆ దేశంలో భూకంపం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. భూకంపం ధాటికి ఆ దేశంలోని అమట్రీస్ నగరం అత్య‌ధికంగా న‌ష్టపోయింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నాయి. గాయాల‌తో బ‌య‌ట‌ప‌డుతోన్న వారికి అక్క‌డే ప్ర‌థ‌మ చికిత్స అందించి ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్నాయి.

  • Loading...

More Telugu News