: జేఎన్‌యూ విద్యార్థినిపై అత్యాచారం కేసులో లొంగిపోయిన నిందితుడు
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థిని(28)పై రేప్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అన్‌మోల్ రతన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బుధవారం రాత్రి 10:45 గంటలకు వసంత్‌కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బాధితురాలు కోరిన సినిమా కాపీని ఇస్తానని ఆశపెట్టి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అనంతరం నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) కార్యకర్త అయిన రతన్‌పై రేప్ కేసు ఆరోపణలు రావడంతో అతడిని సంఘం నుంచి బహిష్కరించింది.