: ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్ లాండర్ 10కు ప్రమాదం


ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన ఎయిర్ లాండర్ 10 ఈరోజు ప్రమాదానికి గురైంది. రెండో టెస్ట్ ఫ్లైట్ లో భాగంగా యూకేలోని బెడ్ ఫోర్డ్ షైర్ లోని కార్డింగ్టన్ ఎయిర్ ఫీల్డ్ లో ఈ విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. విమానం క్రాష్ ల్యాండ్ అయిందని, దాని ముందు భాగం భూమిని తాకడంతో కాక్ పిట్ కొద్దిగా దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. విమాన సిబ్బంది సహా, అందులో ఉన్న వారంతా క్షేమంగానే ఉన్నారని ఎయిర్ లాండర్ 10 తయారు చేసిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ సంస్థ వెల్లడించింది. కాగా, అమెరికా మిలిటరీ అవసరాల నిమిత్తం రూపొందించిన ఎయిర్ లాండర్ 10 ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది. ఈ నెల 17న దీని తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా పూర్తి చేసుకుంది.

  • Loading...

More Telugu News