: ఇప్పటికిప్పుడు యూపీలో ఎన్నికలు జరిగితే హంగ్‌ ఖాయమంటున్న సర్వేలు.. కాంగ్రెస్‌ బలం 5 శాతం దాటదట!


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లంటేనే రాజ‌కీయ వ‌ర్గాల్లో ఎంతో ఆస‌క్తి రేగుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలోను లేన‌న్ని అసెంబ్లీ, లోక్‌స‌భ సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో ప‌ట్టు సాధించాల‌ని జాతీయ పార్టీలు స‌హా రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల‌న్నీ త‌హ‌త‌హ‌లాడుతాయి. ఆ రాష్ట్ర అధికార‌, విప‌క్ష పార్టీలు వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికలను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో ఎవ‌రు గెలుస్తానే అంశంపై తాజాగా స‌ర్వేలు నిర్వ‌హించారు. దీనిలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హంగ్‌ అసెంబ్లీ ఖాయమని చెబుతున్నాయి. కాంగ్రెస్ పావులు క‌దుపుతూ.. త‌మ ముఖ్య‌మంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్‌ను తెచ్చిన‌ప్ప‌టికీ, ప్రచార వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను తెచ్చుకుంటున్న‌ప్ప‌టికీ ఆ పార్టీ బలం ఐదు శాతం కూడా దాటదని స‌ర్వేలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News