: విశాఖపట్టణంలో భూ ప్రకంపనలు
విశాఖపట్టణంలో భూ ప్రకంపనలు సంభవించాయి. సెంట్రల్ మయన్మార్ లో సంభవించిన భూకంపం కారణంగా భారత్ లోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా భూమి కంపించింది. దీంతో పలువురు ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఇదే సమయంలో విశాఖపట్టణంలో కూడా భూమి కంపించిందని అక్కయ్యపాలెం వాసులు చెబుతున్నారు. దేశంలో ఎక్కడ భూకంపం వచ్చినా అక్కయ్యపాలెం చిగురుటాకులా వణికిపోతోందని, దీనికి కారణాలు అన్వేషించాలని అక్కయ్యపాలెం వాసులు డిమాండ్ చేస్తున్నారు. 4:08 నిమిషాలకు నాలుగు సెకెన్ల పాటు అక్కయ్యపాలెం కంపించిందని, భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశామని వారు చెబుతున్నారు.