: ముంబయి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. బేగంపేటలో టీఆర్ఎస్ శ్రేణుల సందడి
మహారాష్ట్రతో మూడు సాగునీటి ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్న ఆయనకు తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. టీఆర్ఎస్ శ్రేణులు కూడా బేగంపేట పరిసర ప్రాంతాలకి పెద్ద ఎత్తున చేరుకుని ఘనస్వాగతం పలుకుతున్నారు. కాసేపట్లో బేగంపేట ఫ్లైఓవర్ దాకా ర్యాలీ ప్రారంభం కానుంది. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడనున్నారు. బహిరంగ సభ నిర్వహించనున్న వేదికపై కళాకారులు ఇప్పటికే పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. బేగంపేట పరిసర ప్రాంతాల్లో కార్యకర్తల కోలాహలం బాగా కనిపిస్తోంది.