: బేగంపేట ఫ్లై ఓవర్ దాకా ర్యాలీ చాలన్న కేసీఆర్!... క్యాంప్ ఆఫీస్ దాకా ర్యాలీ రద్దు చేసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు!
తెలంగాణ సాగునీటి కష్టాలకు చెక్ పెట్టనున్న మూడు భారీ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుని తిరిగివస్తున్న కేసీఆర్ కు ఘన స్వాగతం చెప్పేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసుకున్నాయి. నేటి మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకోనున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలికి సీఎం క్యాంపు ఆఫీస్ దాకా ర్యాలీగా తీసుకునివెళ్లాలని ఆ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే ఈ ర్యాలీపై కేసీఆర్ అయిష్టత చూపారట. బేగంపేట ఫ్లైఓవర్ దాకా ర్యాలీ చాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో కాస్తంత వెనక్కు తగ్గిన టీఆర్ఎస్ శ్రేణులు క్యాంపు ఆఫీస్ దాకా నిర్వహించాలన్న యోచనను విరమించుకున్నాయి.