: గుంటూరు జిల్లాలో భగ్గుమన్న పాతకక్షలు... వేటకొడవళ్లతో దాడి.. ఒకరి మృతి
గుంటూరు జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. తెనాలి మండలం నేలపాడు వద్ద సినిమా సీన్లను తలపించేలా తమ ప్రత్యర్థులపై పలువురు వ్యక్తులు అటాక్ చేశారు. వేటకొడవళ్లతో నలుగురు ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా దాడికి దిగారు. దాడిలో బాలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలయిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలయ్య తన సన్నిహితులతో కలిసి కోర్టుకు వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. దాడికి ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది.