: ఇటలీలో భూకంపం!... కూలిన భవనాలు, శిథిలాల కింద వందలాది మంది జనం!
ఇటలీ దేశాన్ని కొద్దిసేపటి క్రితం పెను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం ఆ దేశంలో పెను విలయాన్నే సృష్టించింది. భూకంపం ధాటికి ఆ దేశంలోని నోర్సియాలో పెద్ద సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. ఈ భవనాల శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇద్దరు చనిపోగా, మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదు. భూకంపం వచ్చిన టనే అప్రమత్తమైన ఇటలీ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు.