: నేనెవరో అచ్చెన్నాయుడుకి తెలియదు...ఇప్పుడు టీవీలో చూస్తే చూడొచ్చు: జగ్గిరెడ్డి


తానెవరో మంత్రి అచ్చెన్నాయుడుకి తెలియదని, ఇప్పుడు టీవీ9 ఇంటర్వ్యూ ద్వారా అచ్చెన్నాయుడుకి తాను ఎవరో తెలిసే అవకాశం ఉందని 'నయీం అనుచరుడు' అంటూ సినీ నిర్మాత నట్టి కుమార్ ఆరోపించిన జగ్గిరెడ్డి తెలిపాడు. వెయ్యి కోట్లు సంపాదించానన్నది అసత్యమని అన్నారు. నట్టి కుమార్ తో తనకు విభేదాలు లేవని ఆయన చెప్పారు. అనకాపల్లిలో రాజా థియేటర్ లో తన భార్య క్యాంటీన్ నడుపుతోందని అన్నారు. ఆ థియేటర్ మేనేజర్ తో ఉన్న లావాదేవీల వల్ల, ఆయన తన ఫోన్ నెంబర్ తో నట్టి కుమార్ కు ఫోన్ చేశారని, దానికే ఆయన తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆయన తెలిపారు. నర్సన్నపేట థియేటర్ ఏదో వివాదంలో చిక్కుకుందని, దానిని తాను ఖాళీ చేయించానని ఆయన ఆరోపించారని, అందులో తన మనుషులు లేరని ఆయన స్పష్టం చేశారు. తనది రైతు కుటుంబమని ఆయన చెప్పారు. నర్సీపట్నంలో నాలుగు థియేటర్లలో క్యాంటీన్లు నడుపుతున్నానని, అది లాభసాటిగా లేకపోవడంతో దానిని సబ్ లీజుకిచ్చానని ఆయన చెప్పారు. తాను బిజినెస్ ను సాఫీగా చేసుకుంటానని, ఎవరితోనూ గొడవలు పడనని ఆయన చెప్పారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే తన మావయ్యని ఆయన తెలిపారు. ప్రస్తుతం తన బావమరిది ఎమ్మెల్యే అని ఆయన చెప్పారు. వారి రాకీయ నేపథ్యమే తప్ప, దందా నేపథ్యం తనకు లేదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News