: విడాకులు తీసుకున్న మరో సినీ నటి
విడాకులకు దరఖాస్తు చేసుకున్న అమలాపాల్ బాటలోనే మరో కొలీవుడ్ నటి దివ్యా ఉన్ని భర్తతో విడాకులు తీసుకుంది. తమిళంలో 'సుభాష్', 'కన్నన్ వరువాన్', 'పాలైయత్తు అమ్మన్', 'వేదం', 'ఆండాన్ అడిమై' తదితర చిత్రాల్లో నటించిన దివ్యా ఉన్ని, మలయాళ, తెలుగు సినిమాల్లో కూడా నటించింది. 2002లో డాక్టర్ సుధీర్ శేఖర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. ఈ దంపతులకు అర్జున్, మీనాక్షీ అనే పిల్లలు ఉన్నారు. అయితే, 14 ఏళ్ల దాంపత్య జీవితం అనంతరం వీరి మధ్య ఎడబాటు వచ్చింది. దీంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు దివ్యా ఉన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె చెల్లెల్ని కూడా హీరోయిన్ చేసే పనిలో ఆమె బిజీగా వుందట. భర్త నుంచి విడిపోయిన తరువాత అమలాపాల్ తిరిగి సినిమాల్లో నటిస్తోంది. మరి దివ్యాఉన్నికి కూడా అవకాశాలు వస్తాయేమో చూడాలి!