: 'జనతా గ్యారేజ్' సెప్టెంబర్ 1న విడుదల ... ధ్రువీకరించిన దర్శకుడు


ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'జనతా గ్యారేజ్' విడుదల తేదీ మారింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేస్తారని ఇప్పటి వరకు వార్తలొచ్చాయి. అయితే, ఇది ఒకరోజు ముందుగా అంటే సెప్టెంబర్ 1నే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు కొరటాల శివ ఇంతకు క్రితం ట్వీట్ ద్వారా తెలిపారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ప్రేక్షకుల, అభిమానుల ప్రేమ, దీవెనలు కావాలంటూ శివ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్ర పోషించగా, సమంతా, నిత్యా మీనన్ కథానాయికలుగా నటించారు. 'నాన్నకు ప్రేమతో' వంటి హిట్టు తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడం ... 'శ్రీమంతుడు' వంటి సూపర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకులలోనూ, ట్రేడ్ వర్గాలలోను పలు అంచనాలున్నాయి.

  • Loading...

More Telugu News