: సింధు, గోపీచంద్, శ్రీకాంత్ లకు చెక్కుల బహూకరణ!


కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవాల సందర్భంగా రియో ఒలింపిక్స్ లో మహిళల బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 3 కోట్ల రూపాయల నగదు చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గణపతి సచ్చాదానంద స్వామి అందజేశారు. వెంకయ్యనాయుడు పుష్పగుచ్ఛంతో అభినందించగా, గణపతి సచ్చిదానంద స్వామి దుశ్శాలువతో సత్కరించారు. సింధు కోచ్ గోపీచంద్ కు 50 లక్షల రూపాయల చెక్కు, కిదాంబి శ్రీకాంత్ కు 25 లక్షల రూపాయల చెక్కులిచ్చి సత్కరించారు. అనంతరం సింధు తల్లిదండ్రులను కూడా జ్ఞాపికలతో సత్కరించారు.

  • Loading...

More Telugu News