: 41 ల‌క్ష‌ల మంది పుష్క‌ర యాత్రికులు రైళ్ల‌లో ప్ర‌యాణించారు: చ‌ంద్ర‌బాబు


నంద్యాల‌-ఎర్ర‌గుంట్ల రైలు మార్గం చాలా కీలకమైందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చ‌ంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఎర్ర‌గుంట్ల‌-నంద్యాల మ‌ధ్య నూత‌న రైల్వే మార్గాన్ని విజ‌య‌వాడ‌ నుంచి రిమోట్ ద్వారా ఈరోజు రైల్వే మంత్రి సురేశ్ ప్ర‌భు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదిక‌పై ఆయ‌న మాట్లాడుతూ... రాయ‌లసీమ అభివృద్ధిలో ఈ రైలు మార్గం కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని చెప్పారు. చెన్నై-ఢిల్లీ వ‌యా విజ‌య‌వాడ‌, విజ‌య‌వాడ‌-ఖ‌ర‌గ్‌పూర్ వ‌యా విశాఖ‌, ముంబ‌యి-ఖ‌ర‌గ్‌పూర్ కారిడార్లను కేంద్రం ప్ర‌క‌టించింద‌ని చంద్రబాబు పేర్కొన్నారు. రైలు మార్గాల ద్వారానే ఎంతో మంది ప్ర‌యాణికులు త‌మ గమ్య‌స్థానాల‌కు చేరుకుంటున్నార‌ని, 41 ల‌క్ష‌ల మంది కృష్ణా పుష్క‌ర యాత్రికులు రైళ్ల‌లో ప్ర‌యాణించారని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

  • Loading...

More Telugu News