: తెలుగు తేజం సింధుని స్వయంగా వేదికపైకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పి.వి సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్ గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. ప్రత్యేక వాహనంలో వచ్చిన వారి వద్దకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని స్వయంగా ఆహ్వానించి, వేదికపైకి తీసుకొచ్చారు. వేదికపై ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు గజమాల వేశారు. వేదికపై మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ ఎంపీలు ఉన్నారు. మరికాసేపట్లో ఆమెను ఘనంగా సన్మానించనున్నారు. ఈ సందర్భంగా స్టేడియం అంతా జయహో సింధు.. సింధు అనే నినాదాలతో మార్మోగిపోయింది.