: సింధుకు ఇష్టమైన ఆ రెండింటితో సెలబ్రేట్ చేసుకుంటాం: తల్లి విజయ


రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ విజేత పీవీ సింధు ఆహార నిబంధనలు ఎంతగానో పాటిస్తుంది. ఒలింపిక్స్ కోసం తనకు ఇష్టమైన ఆహారపదార్థాలను కొన్ని నెలలుగా పక్కన పెట్టింది. ముఖ్యంగా, బిర్యానీ, మైసూర్ పాక్ అంటే సింధుకు ఎంతో ఇష్టం. అయితే, ఒలింపిక్స్ లో పతకం సాధించి నగరానికి వచ్చిన సింధుకు ఇష్టమైన ఆ రెండింటిని తల్లి విజయ సిద్ధం చేశారు. సింధు సాధించిన విజయాన్ని ఆమెకు ఇష్టమైన ఆ రెండింటితో సెలబ్రేట్ చేసుకుంటామని విజయ చెప్పారు. అయితే, సింధు తనకు ఇష్టమైన బిర్యానీ, మైసూర్ పాక్ లను తినేందుకు ఆమె కోచ్ గోపీ చంద్ కేవలం రెండు రోజులు మాత్రమే అనుమతిచ్చాడట. ఆ తర్వాత ఆహార నిబంధనలు ఎప్పటిలాగానే సింధు పాటిస్తుంది.

  • Loading...

More Telugu News