: నలుగురు క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న.. ఆరుగురికి ద్రోణాచార్య పురస్కారం.. ప్రకటించిన కేంద్రం
నలుగురు క్రీడాకారులకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందించనున్నట్లు కేంద్రం ఈరోజు ప్రకటించింది. పీవీ సింధు, దీపా కర్మాకర్, జీతూ రాయ్, సాక్షి మాలిక్ లకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొంది. అలాగే ఆరుగురికి ద్రోణాచార్య పురస్కారం అందించనున్నట్లు తెలిపింది. దీపా కర్మాకర్ కోచ్ విశ్వేశ్వర్ నందికి ద్రోణాచార్య అవార్డు ప్రకటించింది. నాగపురి రమేశ్(అథ్లెటిక్స్), సాగర్ మాల్ ధ్యాయల్ (బాక్సింగ్), రాజ్‌కుమార్ శర్మ (క్రికెట్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్)లకు ద్రోణాచార్య పురస్కారం అందించనున్నట్లు ప్రకటించింది.