: తమిళ ప్రతిపక్షపార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ


తమిళ ప్రతిపక్ష పార్టీ డీఎంకేకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో తమ పార్టీ సభ్యులపై విధించిన సస్పెన్షన్ పై స్టే విధించాలని కోరుతూ డీఎంకే మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్ మహదేవన్ తో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. డీఎంకే సభ్యుల సస్పెన్షన్ పై స్టే ఎత్తివేయడం కుదరదని తీర్పు నిచ్చింది. ఇక ఈ కేసు విషయంలో అసెంబ్లీ స్పీకర్ పి.ధన్ పాల్ కు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ నెల 17న సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారన్న కారణంతో డీఎంకేకు చెందిన 80 మంది సభ్యులపై వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. దీనిని సవాల్ చేస్తూ డీఎంకే నేత స్టాలిన్ ఆధ్వర్యంలోని పార్టీ సభ్యులు కోర్టును ఆశ్రయించడం జరిగింది.

  • Loading...

More Telugu News