: టీవీ ఇంటర్వ్యూకు రూ.4 కోట్లు డిమాండ్ చేసిన హాలీవుడ్ నటి!
టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి భారీ మొత్తాన్ని డిమాండ్ చేసి, హాలీవుడ్ నటి లిండ్సే లోహన్ వార్తల్లోకెక్కింది. రష్యా వ్యాపారవేత్త ఇగోర్ తారాబాసోవ్ (22)తో తన లవ్ మేటర్‌ని వివరించడానికి ఈ భామ దాదాపు రూ. 4 కోట్లు (5 లక్షల ఫౌండ్లు) డిమాండ్ చేసిందట. అంతేకాదు, తాను ఇంటర్వ్యూ ఇవ్వాలంటే తనకు పలు వసతులు కల్పించాలని కూడా అడిగింది. భద్రత, తన రిట్జ్-కార్లటన్ పెంట్హౌస్ లో బస, చేతులు, గోళ్ల కోసం విమానంలో సంరక్షకుడి ఏర్పాటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తాను ఫొటో దిగేందుకు అవకాశం... ఇలా గొంతెమ్మ కోరికలు కోరిందట. రష్యా ప్రభుత్వానికి చెందిన 'చానల్ వన్'కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ఈ భామ ఈ కోరికలు కోరింది. ఇగోర్ తారాబాసోవ్ సాగించిన లవ్ ని ఆ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షో 'పస్ట్ గోవోర్యత్సలో చెప్పేందుకు ఈ డిమాండ్ చేసింది. అయితే వీటిలో కొన్నింటిని ఇచ్చేందుకు నిర్వాహకులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కాగా, ఇగోర్ ప్రవర్తన కారణంగా ఆయనతో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నట్టు కొన్నిరోజుల ముందు లోహన్ పేర్కొంది. వీరిద్దరూ గొడవపడుతున్న సమయంలో పలుసార్లు కెమెరా కంటికి కూడా చిక్కారు. ఇప్పుడేమో తమ అల్లరి ప్రేమను చెప్పేందుకు ఈ భామ ఇంతగా డిమాండ్ చేస్తోంది.