: సాయంత్రం నాలుగింటికి సీఎం కేసీఆర్‌ను, ఐదింటికి గవర్నర్‌ను కలవనున్న సింధు
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి సింధు హైదరాబాద్ గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీకి చేరుకుని మీడియాకు పలు వివరాలు తెలిపింది. తాను మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడానికి బయలుదేరనున్నట్టు చెప్పింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆమె గోపిచంద్‌తో కలిసి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తుంది. ఆ తరువాత అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు బయలుదేరి ఐదింటికి గవర్నర్ నరసింహన్‌ను కలవనుంది.