: బలూచ్ నేతలు భారత పీఎంకు మద్దతిస్తున్నారట!.... ముగ్గురు నేతలపై పాక్ కేసులు!


పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ కు చెందిన రాజకీయ నేతలు... భారత ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలుస్తున్నారట. వినడానికి విడ్డూరంగా ఉన్నా... ఇవే ఆరోపణలతో పాక్ ప్రభుత్వం బలూచిస్థాన్ కు చెందిన ముగ్గురు నేతలపై ఏకంగా కేసులు పెట్టేసింది. ఢిల్లీలోని ఎర్రకోటపై చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో మోదీ బలూచిస్థాన్ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. మోదీ ప్రసంగానికి బలూచ్ లో హర్షం వ్యక్తమైంది. ఈ క్రమంలో కాస్తంత ఆలస్యంగా స్పందించిన పాకిస్థాన్ పోలీసులు వేర్వేరు వ్యక్తుల నుంచి ఫిర్యాదులు అందాయని చెబుతూ మోదీ వ్యాఖ్యలను కీర్తించిన ముగ్గురు బలూచ్ నేతలపై కేసులు పెట్టింది. పాకిస్థాన్ పీనల్ కోడ్ లోని 120, 121, 123, 353 సెక్షన్ల కింద బ్రహ్మందగ్ భుగ్తీ, హర్బియార్ మర్రీ, బనూక్ కరిమా బలోచ్ లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News