: రావులపాలెంలో సినీ నటి ప్రణీత సందడి
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సినీ హీరోయిన్ ప్రణీత సందడి చేసింది. న్యూలుక్స్ హైపర్ మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకు ‘న్యూలుక్స్’ యజమాని కె.యమున, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రణీత మార్ట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రణీత హాజరవుతుందని తెలుసుకున్న అభిమానులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి కనపరిచారు.