: గోపిచంద్ అకాడమీ వద్ద సింధును గజమాలతో సత్కరించిన అభిమానులు
ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి.సింధుని హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. అనంతరం సింధు.. ఆమె కోచ్ పుల్లెల గోపిచంద్‌తో కలిసి గచ్చిబౌలికి సమీపంలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి చేరుకుంది. అకాడమీలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. పూలు చల్లుతూ సింధు, గోపీచంద్‌లకు అక్కడ అభిమానులు ఘనస్వాగతం పలికారు. అకాడమీ వద్ద సింధును గజమాలతో సత్కరించారు. సింధు తమలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని అకాడమీలో కోచింగ్ తీసుకుంటోన్న క్రీడాకారిణులు తెలిపారు.