: సుప్రీం గడప తొక్కిన ‘ఓటుకు నోటు’ కేసు!... మత్తయ్య అభ్యర్థనతో విచారణ నాలుగు వారాలకు వాయిదా!


తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చును రగిల్చిన ఓటుకు నోటు కేసు తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ కేసులో తెలంగాణ ఏసీబీ కీలక నిందితుడిగా ఆరోపిస్తున్న జెరూసలెం మత్తయ్య ప్రమేయానికి సంబంధించి సరైన సాక్ష్యాలు లేవని పేర్కొన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఆయన పేరును చార్జిషీటు నుంచి తప్పించింది. హైకోర్టు నిర్ణయంతో విభేదించిన తెలంగాణ సర్కారు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తెలంగాణ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం కొద్దిసేపటి క్రితం విచారణ చేపట్టింది. అయితే తెలంగాణ సర్కారు పిటిషన్ కు కౌంటర్ పిటిషన్ దాఖలుకు తనకు కొంత సమయం కావాలని మత్తయ్య ధర్మాసనాన్ని వేడుకున్నారు. ఈ మేరకు మత్తయ్య తరఫు న్యాయవాది అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News